Posted [relativedate]
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని ఓ రేంజ్ లో ప్రచారం సాగింది.అంతలోనే ఆ సినిమా ఆగిపోయిందని కబుర్లు వచ్చాయి.తరువాత వంశీ బన్నీ ని కలిసినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయిందని వార్తలు వచ్చాయి. దీని వెనుకున్న కారణాల గురించి ఎన్నో పుకార్లు వినిపించాయి.అయితే వాటన్నిటికీ తెరదించుతూ కళ్యాణ్ రామ్ వంశీ ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి కారణం వివరించాడు.వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చకపోవడం వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ లో అనుకున్న సినిమా మొదలుకాలేదని కళ్యాణ్ స్పష్టం చేసాడు.