ఎన్టీఆర్,చరణ్ ఢీ..మెగా,నందమూరి ఫాన్స్ ఫ్రెండ్లీ?

0
525
ntr and ram charan nominated in iifa awards 2016

 Posted [relativedate]

ntr and ram charan nominated in iifa awards 2016
బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టడం యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కొత్త కాదు. వ్యక్తిగతంగా మంచి మిత్రులైన ఈ ఇద్దరూ ఢీకొట్టబోతున్నారు.ఎక్కడో తెలుసా ? ఈ నెల 28 నుంచి హైదరాబాద్ వేదికగా సాగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా ) అవార్డుల రేసులో ఈ ఇద్దరూ తలపడబోతున్నారు.2016 లో ఒకరు జనతా గ్యారేజ్,ఇంకోరు ధ్రువ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపారు. ఆ ఇద్దరూ ఆ సినిమాల తరపున ఐఫా తెలుగు ఉత్తమ హీరో కోసం నామినేట్ అయ్యారు.జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ నటన అద్భుతం అనిపిస్తే,తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుని ధ్రువ లో సూపర్ గా పెర్ఫామ్ చేసాడు చరణ్.ఈ ఇద్దరిలో ఐఫా ఎవరికి పట్టం కడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డా,అవార్డుల రేసులో ఢీకొడుతున్నా ఈ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ వుంది.ఆహా ..ఇలాంటి కబుర్లు చాలా విన్నాం అనుకుంటున్నారా? మీరు ఎలా అనుకున్నా త్వరలో ఈ ఇద్దరూ ఓ షాకింగ్ వార్తతో బయటికి రాబోతున్నట్టు సమాచారం.కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాతగా మారిన చరణ్,ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నారని ఫిలిం నగర్ లో బలం గా వినిపిస్తున్న మాట.ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్టేనట.దర్శకుడు,కథ ఫైనలైజ్ అయితే కాస్త ఆలస్యంగా అయినా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం లేకపోలేదు.ఇదే నిజమైతే మెగా,నందమూరి ఫాన్స్ బ్యానర్ లు ఒకే సినిమాకి కనిపిస్తాయన్నమాట.ఆ ఇద్దరి ఫాన్స్ ఫ్రెండ్లీ గా వ్యవహరిస్తే అదే ఓ సంచలనం.

Leave a Reply