ఎన్టీఆర్ పిక్చర్ కి శ్రీదేవి ఓకే ?

0
349
ntr and sridevi combination

Posted [relativedate]

ntr and sridevi combination
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం మీద జూనియర్ హీరోగా,బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమా లో స్వీట్ షాక్ వుండబోతోంది . దశాబ్దాల తర్వాత తెలుగు తెరపై అతిలోక సుందరి శ్రీదేవి కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రకి శ్రీదేవిని ఒప్పించేందుకు దర్శకుడు బాబీ ప్రయత్నిస్తున్నారు..ఆమె ఇప్పటికే స్టోరీ విన్నారట..కానీ విజయ్ తో తమిళ్ లో చేసిన సినిమా ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని తాజా ఆఫర్ విషయంలో సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది.అందుకే కధ నచ్చినట్టు చెప్పి కూడా నిర్ణయం తర్వాత చెప్తానని శ్రీదేవి అన్నట్టు సమాచారం.శ్రీదేవి ఈ సినిమాకి ఓకే అంటారని ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆశగా ఎదురు చూస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా శ్రీదేవి డెసిషన్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నాడు. తన అభిమాన నటి శ్రీదేవి తో నటించే ఛాన్స్ వస్తే ఏ పాత్రకైనా రెడీ అన్నట్టు గతంలో ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.ఇప్పుడు అదే అవకాశం కళ్ల ముందు కనిపిస్తోంది.తాత ఎన్టీఆర్ పక్కన మనవరాలిగా మొదలెట్టి హీరోయిన్ గాను నటించిన ఆమె ఇప్పుడు ఈ సినిమా ఒప్పుకుంటే ….పెద్దాయన మనవడితో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తుందో?

Leave a Reply