జక్కన్నకి ఎన్టీఆర్ ఆన్సర్ ఇదే ..

Posted September 28, 2016

  ntr answered rajamouli
స్టూడెంట్ నెంబర్ 1 నాటి సంగతులు ముచ్చటించిన రాజమౌళికి ఎన్టీఆర్ బదులిచ్చారు.15 ఏళ్ల నాటి విషయాలు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు.ఈ 15 ఏళ్లలో జక్కన్న ఓ ప్రపంచమంతా తెలుగు సినిమా ఖ్యాతిని చాటే గొప్ప దర్శకుడిగా ఎదిగాడని ఎన్టీఆర్ ప్రశంసించారు.తన గురించి మాత్రం..19 ఏళ్ల కుర్రోడిగా పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు తండ్రిగా మారానని చెప్పుకున్నారు.ఓ నటుడిగా ,స్టార్ గా ఈ 15 ఏళ్లలో తనకి వచ్చిన గుర్తింపు మీద తారక్ మాట్లాడలేదు. ఇద్దరి జీవితాల్లో ఎన్ని మార్పులు వచ్చినా అప్పటి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.అభిమానులు మాత్రం ఈ పరస్పర పొగడ్తలు ఆపి కలిసి ఎప్పుడు సినిమా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

SHARE