వచ్చే ఏడాది సెట్స్ మీదకు ఎన్టీఆర్ సినిమా..

 Posted March 31, 2017

ntr biopic movie sets on next yearప్రస్తుతం బాలకృష్ణ తన 101వ సినిమాగా  పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.  కాగా ఇటీవల బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి బాలయ్య తన 101వ సినిమాగా ఎన్టీఆర్ బయోపిక్ నే చేయాల్సి ఉంది. ఈ బయోపిక్ ని బాలయ్య స్వీయ దర్శకత్వంలో చేయనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే నటన, దర్శకత్వం రెండిటిని బ్యాలెన్స్ చేయడం కష్టమనుకున్న బాలయ్య ఈ బయోపిక్ కి దర్శకత్వం వహించే బాధ్యతను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి అప్పగించాలనుకున్నారు. ఈ మేరకు బాలయ్య రాఘవేంద్రరావుతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే రాఘవేంద్రరావు సున్నితంగా తిరస్కరించడంతో ఎన్టీఆర్ బయోపిక్  కి దర్శకుడిగా ఎవర్ని సెలక్ట్ చేయాలో తెలియక బాలయ్య కాస్త అయోమయంలో పడ్డారు. దీంతో చేసేది లేక పూరీ సినిమాకు కమిట్ అయ్యారు. కాగా ఎన్టీఆర్ బయోపిక్ ని తన 102వ సినిమాగా చేస్తున్నట్లు, వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు బాలయ్య ప్రకటించారు. మరి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను బాలయ్య ఎవరికైనా  అప్పగిస్తారో.. లేక మనసు మార్చుకుని తానే దర్శకత్వం వహిస్తారో చూడాలి.  

SHARE