ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ జనతా గ్యారేజ్…

  ntr carrier best movie janatha garage

జనతా గ్యారేజ్ కలెక్షన్ల ప్రభంజనం లో మరో మైలు రాయి చేరింది.కేవలం 5 రోజుల్లో ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. వినాయక చవితినాడు కలెక్షన్లు భారీగా వచ్చాయి.రిలీజ్ అయిన రెండో రోజు కన్నా ఎక్కువ వసూళ్లు పండుగ రోజు జనతా గ్యారేజ్ సాధించింది. మొత్తం 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 58 కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఇంతక ముందు నాన్నకు ప్రేమతో వున్న ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని తుడిచిపెట్టింది.

ఇక జనతా గ్యారేజ్ గ్రాస్ చూసి టాలీవుడ్ ఆశ్చర్యపోయి చూస్తోంది. మొత్తం 5 రోజుల్లో 133 కోట్ల గ్రాస్ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రఖ్యాత ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ 4 రోజుల్లో జనతా గ్యారేజ్ 115 కోట్ల గ్రాస్ సాధించినట్టు రిపోర్ట్ చేసింది. ఇదే హవా మరో వరం 10 రోజులు ఉంటే జనతా గ్యారేజ్ 100 కోట్ల నెట్ కొల్ల గొడుతుందని కూడా ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం. ఏదేమైనా ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ జనతా గ్యారేజ్ ఆయనకి అన్ని విధాలుగా కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలుస్తోంది…

SHARE