Posted [relativedate]
టైటిల్ చూసి అందరు షాక్ అయ్యి పోవడం ఖాయమే.. అయినా సరే ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఇది జరిగి తీరుతుందని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. నందమూరి హీరోలు ముఖ్యంగా బాబాయ్, అబ్బాయ్ ల మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఎవరికి వారుగా చీలిపోయి సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ ఆ సినిమా ఆడియోల్లో నందమూరి వంశ కీర్తి ప్రతిష్టల గురించి ప్రస్థావిస్తూ తన సత్తా చాటుకున్నారు. ఇక మరో వర్షన్ లో ఎప్పుడూ లేనిది జూనియర్ తన తండ్రి హరికృష్ణను ఆడియో ఫంక్షన్స్ లకు పిలిచి హంగామా చేయడం మొదలుపెట్టాడు.
నందమూరి హీరోల మధ్య ఈ వార్ లో ఫ్యాన్స్ ఎటు తేల్చుకోలేక తలలు పట్టుకున్న సందర్భాలు ఎన్నో.. ఈ సంవత్సరం సంక్రాంతికి కూడా బాలయ్య డిక్టేటర్, ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో ఇలా రెండు సినిమాలు ఒక్కరోజు తేడాతో రిలీజ్ అవడంతో బాబాయ్ తో అబ్బాయ్ ఢీ కొడుతున్నాడంటూ సినిమా భాషలోనే పర్సనల్ ఫైట్ ను వ్యక్తీకరించారు మీడియా వారు. ఇక ఇన్ని జరుగుతున్నా సరే అటు బాబాయ్ గాని ఇటు అబ్బాయ్ గాని మారు మాట మాట్లాడలేదు. ఈ ఇద్దరి మధ్య పెద్ద చీలికను ఏర్పరచినా అప్పుడప్పుడు జూనియర్ తన మాటల ప్రస్థావనలో బాలయ్య పేరు తెచ్చేవాడు.
అయితే బాలయ్య మాత్రం ఎప్పుడు ఎన్.టి.ఆర్ పేరు కాదు కదా ఆ ఆలోచన కూడా రాకుండా చేసుకున్నాడు. తనకెదురుగా నిలుస్తున్న నందమూరి హీరోల ధైర్యానికి మెచ్చుకోవాలా లేక తన ముందు పెరిగిన వాళ్లు తనకు పోటీ ఏంటని ధిక్కరించాలా తెలియక సైలెంట్ గా ఉండిపోయాడు బాలయ్య.
ఇక నిన్న రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ప్రభంజనం సృష్టించడమే కాదు ఆ సినిమా గురించి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఓ విధంగా బాబాయ్ మెప్పు పొందేందుకు అబ్బాయ్ తగ్గి చేసిన ఈ ప్రయత్నం కాస్త మెచ్చుకోదగినదే.. ఇక ఈ ట్వీట్ ఒక్కసారిగా నందమూరి అభిమానులందరికి ఒకే తాటిపై తీసుకొచ్చింది. అంతేకాదు తారక్ ట్వీట్ తర్వాత కళ్యాణ్ రాం కూడా ట్వీట్ చేయడం వెంటనే బాబాయ్, అబ్బాయ్ లు ఫోన్ లో సంభాషించడం జరిగాయట. అంతేనా ఈ నెల 24న తిరుపతిలో జరుగనున్న ఈ సినిమా ఆడియోకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని ఎక్స్ క్లూజివ్ న్యూస్.
అదే కనుక జరిగితే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులుండవు.. అదే నిజమైతే నందమూరి ఫ్యాన్స్ సంక్రాంతి పండుగా డిసెంబర్ లోనే వచ్చేసినట్టే. మరి ఊరిస్తున్న ఈ పరిస్థితులు ఫ్యామిలీని ఒక్కటిగా చేస్తాయా లేక ఇంకా మొహమాటపు నడవడిలో వెనుకడుగేసేలా చేస్తాయా అన్నది వేచి చూడాలి.