ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్..

Posted April 10, 2017

ntr classical dance
జైలవకుశ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్న ఎన్టీఆర్ ఇంకో షాక్ కూడా ఇవ్వబోతున్నాడు. ఓ పాత్రకి సంబంధించి క్లాసికల్ డాన్స్ చేస్తున్నాడు.ఓ నిమిషం పాటు ఆగకుండా చేసే ఈ బిట్ కంపోజిషన్ బాధ్యతను సీనియర్ డాన్స్ మాస్టర్ శివశంకర్ కి అప్పగించారట.ఎన్టీఆర్ మంచి డాన్సర్ అయినప్పటికీ క్లాసికల్ తో టచ్ పోయి చాలా ఏళ్ళు అయిందిగా అనుకుంటూ సెట్స్ మీదకి వచ్చారట శివశంకర్ మాస్టర్.పైగా హెవీ మూమెంట్స్ ఉండాల్సిన ఎపిసోడ్ కావడంతో క్లిష్టమైన కంపోజిషన్ చేశారు ఆయన.కానీ శివశంకర్ మాస్టర్ అనుకున్నది జరగలేదు.ఎంతో హెవీ మూమెంట్స్ అని శివశంకర్ మాస్టర్ ఫీల్ అయిన డాన్స్ ని అవలీలగా,గ్రేస్ ఫుల్ గా చేసేసాడు ఎన్టీఆర్.

ఈ పాట కోసం సుదీర్ఘ రిహార్సల్,ఎన్నెన్నో టేక్ లు ఇలా ఊహించి సెట్ లోకి వచ్చిన శివశంకర్ మాస్టర్ ఎన్టీఆర్ డాన్స్ చూసి షాక్ తిన్నాడంట.అంతే కాక తనదైన స్టైల్ లో నీకో దండం రా నాయనా అని తనదైన స్టైల్ లో ఆశ్చర్యం,ఆశీర్వచనం పలికి వెళ్ళారంట.దట్ ఈజ్ ఎన్టీఆర్.

SHARE