Posted [relativedate]
సినిమావాళ్లకి బోల్డన్ని సెంటిమెంట్స్ ఉంటాయని, ఆ సెంటిమెంట్స్ ఫాలో అయ్యి వారు సక్సెస్ కొడుతుంటారని అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో అప్పట్లో ఓ ట్రెండ్ లా, ఓ సెంటిమెంట్ లా క్రియేట్ అయ్యింది వాయిస్ ఓవర్. ఒక హీరో నటించిన సినిమాలో వేరే హీరో చేత వాయిస్ ఓవర్ చెప్పించి హిట్స్ కొట్టారు కొంతమంది దర్శకనిర్మాతలు. జల్సా సినిమాకి మహేష్, మర్యాదరామన్నకి రవితేజ ఇలానే వాయిస్ ఓవర్లు చెప్పారు. అలాగే ఎన్టీఆర్ కూడా రామరామ కృష్ణకృష్ణ వంటి సినిమాలకు వాయిస్ ను అందించాడు. అయితే తాను వాయిస్ అందించిన సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో ఇక మీదట ఇతర సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వకూడదని నిర్ణయించుకన్నాడట.
తాజాగా రానా నటించిన ఘాజీ చిత్రానికి వాయిస్ ఓవర్ కోసమని ఆ చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ను సంప్రదించగా, అతను నో చెప్పినట్లు సమాచారం. తాను వాయిస్ ఓవర్ చెప్పిన సినిమాలు అంతగా ఆడలేదని, ఇక భవిష్యత్తులో కూడా వాయిస్ ఓవర్ ను చెప్పను అని సున్నితంగా తిరస్కరించాడట. ఒకవేళ ఇది నిజమైతే ఎన్టీఆర్ సినిమాలకు తప్ప మరో ఇతర సినిమాలకు అతని వాయిస్ వినలేము అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.