మొదటి సారి ఎన్టీఆర్ అలా..!

114

Posted [relativedate]

Ntr First Time Doing In His Careerజనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కథలు విన్నాడు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరక్టర్ దగ్గర నుడి కుర్ర డైరక్టర్స్ తో కూడా చర్చలు జరిపాడు. అయితే ఫైనల్ గా బాబి చెప్పిన కథను ఓకే చేసి కొబ్బరి కాయ కూడా కొట్టేశాడు. ఇక సినిమాలో తారక్ డ్యుయల్ రోల్ అని నిన్న మొన్నటి మాట కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో కనిపించనున్నారట. ఇప్పటిదాకా ద్విపాత్రాభినయంలోనే అలరించిన తారక్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.

పవర్ సినిమాతో హిట్ అందుకుని పవర్ స్టర్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ చవిచూసిన బాబి తారక్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథ సిద్ధం చేశాడట. చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు లాంటి కథతో బాబి అద్భుతమైన లైన్ ప్రిపేర్ చేశాడట. అది నచ్చే బాబికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమా స్టార్ట్ అవడానికి ముందే ఈ న్యూస్ లీక్ అవడం పట్ల డైరక్టర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట తారక్. ఇక మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుథ్ పేరు కూడా వినపడుతుంది. అతనితో అసలు మాట్లాడనేలేదట.

కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఆడియెన్స్ లో ఓ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. అయితే ఇక మీదట సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకుండా జాగ్రత్తపడాలని చూడాలని తారక్ దర్శక నిర్మాతలకు చెప్పాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here