కోలీవుడ్ ని కాపీ కొడుతున్న ఎన్టీఆర్..!!

0
602
ntr follow for jai lava kusa movie to kollywood heros ajith surya and vikram

Posted [relativedate]

ntr follow for jai lava kusa movie to kollywood heros ajith surya and vikram
తెలుగులో హిట్టైన చాలా సినిమాలను వివిధ భాషల్లో రీమేక్ చేసి అక్కడ కూడా విజయాన్ని సాధిస్తున్నారు చాలా మంది పరభాషా హీరోలు. కేవలం సినిమాలనే కాక టాలీవుడ్ హిట్ ఫార్ములాలను కూడా వాడేసుకుంటన్నారు మరి కొంతమంది హీరోలు. అయితే ఎన్టీఆర్ రూటే సపరేట్. టాలీవుడ్ లో కోలీవుడ్ హిట్ ఫార్ములాను ఉపయోగించే ఐడియాలో ఉన్నాడు.

తమిళ హీరోలు చాలామంది తమ సినిమాలలో తామే విలన్‌లుగా నటించి సక్సెస్‌ను సాధించారు. ‘వాలి’ సినిమాలో అజిత్‌, ’24’లో సూర్య, ‘ఇరుముగన్‌’లో విక్రమ్‌ విలన్లుగా నటించి తమలోని డిఫరెంట్ యాంగిల్ ను చూపించి సక్సెస్ సాధించారు. అయితే ఈ ప్రయోగాన్ని అప్పట్లో ఎన్టీఆర్‌, కృష్ణ చేసినా… ప్రజెంట్ జనరేషన్ హీరోలెవ్వరూ టచ్ చేయలేదు. సరిగ్గా ఈ ఫార్ములాను క్యాష్ చేసుకుని ట్రెండ్ సెట్టర్ అవ్వాలనుకుంటున్నాడట ఎన్టీఆర్. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిల్లో ఒక క్యారక్టర్ లో విలనిజాన్ని ప్రదర్శించనున్నాడట ఈ నందమూరి వారసుడు. దీంతో ఎన్టీఆర్ కోలీవుడ్ ను కాపీ చేస్తున్నాడన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొట్టడం మొదలైపోయింది.

Leave a Reply