రాశీ కి ఎన్టీఆర్ లిఫ్ట్..

Posted January 20, 2017

ntr giving movie chance to rashi khanna in jai lava kusa movie
రాశీ ఖన్నా…టాలెంట్ కి ఏ మాత్రం కొదవ లేని ఈ ముద్దుగుమ్మకి టాప్ స్టార్స్ సరసన నటించే అవకాశాలు మాత్రం ఇప్పటిదాకా రాలేదు.దీంతో మీడియం రేంజ్ హీరోలు సినిమాలతో సరిపెట్టుకుంటున్న రాశీ కి ఊహించని లిఫ్ట్ దొరికింది.ఎన్టీఆర్ హీరోగా,బాబీ దర్శకత్వంలో వస్తున్న జైలవ కుశ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.ఎన్టీఆర్ స్వయంగా రాశీ పేరు రిఫర్ చేసినట్టు తెలుసుకుని ఆ అమ్మడు పొంగిపోతోంది.ఎన్టీఆర్ సరసన చేసే అవకాశం ఊహించని అమ్మడు ఫుల్ ఖుషీ అయిపోతోంది.జై లవకుశ లో ముగ్గురు హీరోయిన్లు ఉండగా మొదటగా రాశీ పేరు డిసైడ్ అయింది.మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ కోసం జల్లెడ పడుతున్నారు.సమంత,తమన్నా,కాజల్ వీరిలో ఒకరు ఓ ముఖ్యపాత్ర పోషిస్తారట.ఇంకో హీరోయిన్ పాత్రకి కొత్తవారిని తీసుకునే అవకాశముంది.అయితే ముగ్గురిలో ఒకరిగా వున్నా తన పాత్రకి మంచి ప్రాముఖ్యం ఉందని రాశీ చెబుతోందట.ఈ అమ్మడు ఆశించినట్టే జై లవకుశ అమ్మడి కెరీర్ ని గాడిలో పెట్టాలని కోరుకుందాం.

SHARE