పచ్చసేనాధిపతి ఎన్టీఆర్?

 ntr green plants lover janatha garage
సామాజిక అంశాల్ని వెండితెరపై ఆవిష్కరించడం కొత్త కాదు .ఆ ప్రయత్నం విజయవంతమైతే ఎంతోకొంత మార్పు కూడా తధ్యం.ఇటీవల వచ్చిన శ్రీమంతుడు సినిమా వల్ల గ్రామాల దత్తత పెద్ద ఎత్తున జరిగింది.ఆ సినిమా తీసిన కొరటాల శివ ఇప్పుడు జనతా గ్యారేజ్ ద్వారా మరో బలమైన మెసేజ్ ఇవ్వబోతున్నాడు.అదే ప్రకృతి పరిరక్షణ ..పచ్చని ఆ ప్రకృతి కాపాడే సేనాధిపతిగా ఎన్టీఆర్ ఉంటారని ఇప్పటికే ట్రైలర్స్ తో రివీల్ అయ్యింది .

అయితే ఆ ప్రభావం సినిమాకే పరిమితం కాదని ఎన్టీఆర్ అభిమానులు నిరూపిస్తున్నారు.ఇప్పటికే చాలామంది మొక్కలు నాటే పని మొదలెట్టారు.మరొకొందరు మరో అడుగు ముందుకెళ్లి మొక్కల పంపిణి చేపట్టారు .అంతటితో ఆగకుండా ప్రకృతి పరిరక్షణ కోసం సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.తాము నాటిన,నాటుతున్న మొక్కల ఫొటోల్ని సోషల్ మీడియా లో ఉంచుతూ మరికొందరిలో స్ఫూర్తి రగిలిస్తున్నారు .మొత్తానికి పచ్చసేనాధిపతిగా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కి ముందే సూపర్ హిట్ అయ్యారు .

SHARE