Posted [relativedate]
గుణశేఖర్ చేసిన రుద్రమదేవి సినిమాలో గోనగన్నా రెడ్డి పాత్ర ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అడిగారని తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం సినిమా కథను మార్చమన్నాడని వదిలేశాడు గుణశేఖర్. ఇక ఆ క్యారక్టర్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇరగదీసేశాడు. అయితే ఇప్పుడు మరోసారి గుణశేఖర్ తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. భక్త ప్రహ్లాద కథతో తెరకెక్కించే హిరణ్యకశిపుడు సినిమాలో తారక్ తో చర్చలు జరుపుతున్నాడట. పౌరాణిక సినిమాల్లో తారక్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాల రామాయణంలో రాముడిగా.. యమదొంగలో యంగ్ యమగా అలరించిన తారక్ ఇప్పుడు హిరణ్యకశిపుడుగా కనిపించనున్నాడు. గోన గన్నారెడ్డి పాత్ర మిస్ అయినందుకు సినిమా రిలీజ్ తర్వాత ఆ క్యారక్టర్ కు వచ్చిన క్రేజ్ కు తారక్ కాస్త ఆలోచించాడట. ఇక ఈసారి గుణశేఖర్ కనుక కరెక్ట్ నేరేషన్ తో వస్తే కచ్చితంగా ఓకే చేస్తాడని అంటున్నారు. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క పౌరాణిక సినిమాల్లో నటించాలని అంటే ప్రస్తుతం ఉన్న హీరోల్లో తారక్ ది బెస్ట్ అని చెప్పేయొచ్చు. అందుకే గుణశేఖర్ హిరణ్యకశ్యపుడిగా ఎన్టీఆర్ తోనే ఈ సినిమా తీయాలని చూస్తున్నాడు.
ఇక ఇదే కాకుండా మహానటి సావిత్రి బయోపిక్ గా వస్తున్న మహానటి సినిమాలో కూడా యంగ్ టైగర్ సీనియర్ ఎన్టీఆర్ లా కనిపించనున్నాడట. తాత పోలికలతో పుట్టడమే కాదు అదే రేంజ్ స్టామినాతో కెరియర్ కొనసాగిస్తున్నాడు కాబట్టే తారక్ కు మాత్రమే ఇలాంటి గొప్ప అవకాశాలు వస్తున్నాయని చెప్పొచ్చు.