యుఎస్ లో సెటిల్ అయిపోతున్న ఎన్టీఆర్..?

 ntr janata garage movie collections history create america
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యుఎస్ లో సెటిల్ అయిపోతున్నట్టే కనిపిస్తోంది.తెలుగునాట చిన్న వయసులోనే రికార్డులు సెట్ చేసిన ఎన్టీఆర్ USA మార్కెట్ లో మాత్రం వెనుకబడ్డాడు.ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా కూడా ఓవర్సీస్ మార్కెట్ లో ఎన్టీఆర్ సత్తాకి తగ్గట్టు వసూళ్లు చేయలేకపోయాయి.తారక్ మీదున్న మాస్ ఇమేజ్ అమెరికాలో కల్లెక్షన్లకి అడ్డుగా నిలిచేది.ఇంతలో ఓవర్సీస్ మార్కెట్ పరిధి పెరగడం తో ఎన్టీఆర్ ఓవరాల్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడేది.ఈ విషయం గమనించిన తారక్ తన స్టైల్,సినిమాల ఎంపిక విధానం మార్చుకున్నాడు.వెంటనే ఫలితం కూడా వచ్చింది.టెంపర్,బాద్షా సినిమాలతో మిలియన్ డాలర్ మార్క్ దాటాడు.

తర్వాత వచ్చిన నాన్నకి ప్రేమతో సరికొత్త ట్రెండ్ సృష్టించింది.క్లాస్ సినిమాగా అది యుఎస్ మార్కెట్ లో దుమ్ము లేపి తొలిసారి 2 మిలియన్ డాలర్ రుచి ఎన్టీఆర్ కి చూపించింది.దాదాపు 14 కోట్లు అమెరికాలోనే వసూలు చేసి తారక్ స్టామినా అమాంతం పెరిగేలా చేసింది.ఈ సినిమాతో తారక్ ఓవర్సీస్ లోను ప్రామిసింగ్ హీరో అయిపోయాడు.ఇప్పుడు జనతా గ్యారేజ్ ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది.వారం మధ్యలో విడుదలైనప్పటికీ తొలిరోజే 5 లక్షల 60 వేల డాలర్ లకి పైగా వసూలు చేసింది.అంటే 3 కోట్ల 76 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.ఈ లెక్కలు ఇంకాస్త పెరగొచ్చు.ఇదే ట్రెండ్ కొనసాగితే వారాంతానికి గ్యారేజ్ 10 కోట్ల మార్క్ సులభంగా దాటిపోతుంది.లాంగ్ రన్ లో నాన్నకిప్రేమతో ని దాటే అవకాశం కనిపిస్తోంది.మొత్తానికి యుఎస్ మార్కెట్ లో తారక్ సెటిల్ అయినట్టే కనిపిస్తోంది.

SHARE