ఎన్టీఆర్ పై కుట్ర.. ఇదిగో రుజువు !

 Posted October 31, 2016

ntr janatha garage movie on wrong statementsయంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కుట్ర జరుగుతుందని కొద్ది కాలంలో సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.’జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ కావడంతో..విడిచిపెడితే తారక్ చేతికందడు.తొక్కడానికి ఇదే సరైన సమయని ‘జనతా గ్యారేజ్’ వసూళ్లు ఫేక్ అంటూ సోషల్ మీడియాలో పని గట్టుకొని ప్రచారం  చేశారని తారక్ అభిమానులు ప్రూప్స్ తో సహా బయటపెట్టారు. ఈ కుట్ర వెనక రాజకీయ నేతల హస్తం కూడా ఉందని చెప్పుకొచ్చారు.

అయితే, తాజాగా,మరో కుట్రకు సంబంధించిన మరో రుజువుని చూపిస్తున్నారు తారక్ అభిమానులు.జనతా గ్యారేజ్ 50రోజులు కూడా పూర్తవ్వకముందే బుల్లితెరపై సందడి చేసిన విషయం తెలిసిందే.టీవీల్లో గ్యారేజ్ ప్రసారంపై ఎన్ టీఆర్ అభిమానులు నిరసని వ్యక్తం చేశారు కూడా.ఈ విషయం కాసెపు ప్రక్కన పెడితే..’జనతా గ్యారేజ్’ సినిమాతో టీవీ టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోతాయని ఛానల్స్ యాజమాన్యం భావించింది.కానీ..ఊహించిన రేంజ్ లో టీఆర్పీ రేటీంగ్స్ రాలేదు.దీనికి కారణం టీవీల్లో జనతా గ్యారేజ్ ప్రసారం అయ్యే దానికి రెండు మూడు రోజుల ముందే..ఆల్ లైన్ లో హెచ్ డీ క్వాలిటీ లింక్ ని లీక్ చేశారట.దీనివల్ల అప్పటికే చాలామంది ఆన్ లైన్ జనతా గ్యారేజ్ ని చూసేశారంట.ఈ కారణావల్ల..బుల్లి తెరపై ఎన్ టీఆర్ హవాని అడ్డుకొన్నట్టు చెబుతున్నారు.కుట్రలో భాగంగానే ఈ కుట్రకు పాల్పడినట్టు తారక్ ఫ్యాన్స్ చెబుతున్నారు.ఇంతకీ బుడ్డోడిపై కుట్రకి పాల్పడుతున్నది ఎవరంటారు.. ?

SHARE