సెప్టెంబర్ 1 న జనతా గ్యారేజ్ …

 ntr janatha garage september 1 release
పుష్కరకాలం తరువాత నేను కొట్టబోయే భారీ హిట్ ఇదేనేమో ….నాటి సింహాద్రితో పోలుస్తూ జనతా గ్యారేజ్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలివి.ఇది చాలు ఈ సినిమాపై ఆయనకున్న నమ్మకానికి …ఒకప్పుడైతే ఏమోగానీ ఓ సంపూర్ణ వ్యక్తిత్వం మూర్తీభవిస్తున్నట్టు కనిపిస్తున్న అయన మాటల్ని ఈసారి అంత తేలిగ్గా తీసేయలేము.ఎన్టీఆర్ నమ్మకం చూశాక అయన అభిమానుల విశ్వాసం అంతకు పదింతలైంది.

దీంతో సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని యంగ్ టైగర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.ఆ ముహూర్తం ఖరారైంది .సెప్టెంబర్ 1 న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్ లలో ఈ సినిమా విడుదలకి సన్నాహాలు చేశారు.

జనతా గ్యారేజ్ మీద ఎన్టీఆర్ ఇంత నమ్మకం పెట్టుకోడానికి ప్రధాన కారణం డైరెక్టర్ కొరటాల శివ. అయన కూడా చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ లోని నటుడికి …అయనఇమేజ్ కి తగిన కథ జనతా గ్యారేజ్ అని శివ చెప్పారు.ఈ సినిమా అభిమానులనే కాదు ప్రేక్షకులందర్నీ ఆలరిస్తుందని అయన నమ్మకం.ఇక నిర్మాతలు తమ ఖాతాలో అతిపెద్ద హిట్ కొడతామన్న దీమాతో వున్నారు.

date - 2 copy

SHARE