ఎన్టీఆర్ కొత్త సినిమా ముహూర్తం ఫైనలైజ్..

0
465
ntr kalyan ram and bobby jai lava kusa movie sets on february

Posted [relativedate]

ntr kalyan ram and bobby jai lava kusa movie sets on february
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ముహూర్తం ఖరారైంది.ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న యూనిట్ ఈ సినిమాని ఫిబ్రవరి 11 న సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకుంది.ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తున్న ఈ సినిమా కథ,కధనాల మీద ప్రత్యేక ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.జై లవకుశ పేరుతో వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించే రెండు పాత్రలు వెరీ వెరీ స్పెషల్ గా ఉంటాయట.

ఇక ఈ సినిమా కోసం పని చేసే సాంకేతిక సిబ్బంది ఇప్పటికే డిసైడ్ అయినా ఒక్క ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదట.అమిర్ ఖాన్ కి భారీ హిట్లుగా నిలిచిన పీకే,త్రీ ఇడియట్స్ వంటి చిత్రాలకి పనిచేసిన ck మురళీధరన్ ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.కథ లో ఫోటోగ్రఫీ కి వున్న ప్రాధాన్యం రీత్యా భారీ ఆఫర్ ఇస్తామని ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆయన్ను సంప్రదించినట్టు తెలుస్తోంది.ఒకవేళ అయన డేట్స్ విషయంలో ఏదైనా ఇబ్బందులు వస్తే సినిమా షెడ్యూల్ లో కొద్దిపాటి మార్పులు వస్తాయట.

Leave a Reply