నందమూరి ‘బ్రదర్స్’ బుక్ అయ్యింది !

Posted October 5, 2016

  ntr kalyan ram multi starrer movie title brothers

నందమూరి మల్టీస్టారర్ రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఓ అడుగు ముందుకు పడింది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ‘బ్రదర్స్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని ఫిల్మ్ నగర్ సమాచారమ్.ఈ టైటిల్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కలసి నటించబోయే చిత్రం కోసమంటూ ప్రచారం సాగుతోంది.

నందమూరి బ్రదర్స్ లో తారక్, కళ్యాణ్ లు మాత్రమే కనిపిస్తారా.. ? బాబాయ్ బాలయ్య, హరికృష్ణ.. తదితరులు కూడా మెరవనున్నారా.. ?? అన్నది ప్రస్తుతం
సస్పెన్స్ గా ఉంది. నందమూరి హీరోలంతా ‘బ్రదర్స్’ భాగస్వామ్యం అయితే మాత్రం.. ఈ బ్రదర్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పవచ్చు.

ఇక, ఇటీవలే ‘జనతా గ్యారేజ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. పూరీ జగన్నాథ్  దర్శకత్వంలో తారక్ తదుపరి చిత్రం ఉండనుందనే ప్రచారం  జరుగుతోంది. మరోవైపు, కళ్యాణ్ రామ్ ‘ఇజం’ రిలీజ్ కి రెడీ ఉంది. దసరాకి రావాల్సిన ఇజం
కాస్త డిసెంబర్ కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

SHARE