క్రిష్ తో ఎన్టీఆర్ కొత్త మూవీ?

 Posted October 25, 2016

ntr krish new movie
కొత్తసినిమా,దర్శకుడి ఎంపిక కోసం ఎన్టీఆర్ ఎదురుచూపులకి ఓ దారి దొరికినట్టు తెలుస్తోంది.ఇజం రిలీజ్ అయ్యాక పూరి ఆప్షన్ కూడా వదిలేసుకున్న తారక్ …బాబాయ్ 100 వ సినిమా చేస్తున్న క్రిష్ మీద మనసు పడ్డాడంట.గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ రిలీజ్ అయిన తరువాత క్రిష్ టేకింగ్ కి తారక్ ఫ్లాట్ అయ్యాడు. దర్శకుడు క్రిష్ కి ఫోన్ చేసి పొగడ్తల వర్షం కురిపించాడట.అదే టైం లో వీలైతే కొన్ని సన్నివేశాలు చూడాలని ఉందని తారక్ అనడంతో క్రిష్ ఖుషీ అయ్యి ఎప్పుడైనా రెడీ అన్నారంట.ఆ సంభాషణ అలా ముందుకెళ్లి శాతకర్ణి విశేషాలతో పాటు ..కొత్త కధలు దాకా వెళ్లిందట.క్రిష్ చెప్పిన ఓ లైన్ తారక్ ని తెగ ఇంప్రెస్ చేసిందట.అనుకోకుండా మాటల మధ్య కలిసిన ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.చూద్దాం ఇప్పటికైనా తారక్ అన్వేషణ ఫలిస్తుందో ..లేదో?

SHARE