మా టీవీ తో ఎన్టీఆర్ లక్కీ..

0
439
ntr luckey through maa tv

  Posted [relativedate]

ntr luckey through maa tvఎవరి అదృష్టాన్ని ఎవరు చెడగొట్టగలరు? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మా టీవీ విషయంలో ఇది మరోసారి రుజువైంది.బాహుబలి,శ్రీమంతుడు తర్వాత అతి పెద్ద విజయం దక్కించుకున్న చిత్రంగా జనతా గ్యారేజ్ నిలిచింది.టాలీవుడ్ థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాని విడుదలైన 50 రోజుల్లోనే టీవీ లో ప్రదర్శించారు.అప్పట్లో మా టీవీ నిర్ణయం మీద ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు.దీని వల్ల సినిమాకి నష్టం కలుగుతుందని ఆవేదన చెందారు.అయితే బిజినెస్ ఒప్పందానికి అనుగుణంగా మా టీవీ చర్యని ఎవరూ నిరోధించలేకపోయారు.

అప్పుడు మాటీవీ ఏ ఉద్దేశంతో ఈ పని చేసినా ఇప్పుడు అదే ఎన్టీఆర్ కెరీర్ లో ఓ రికార్డు కి కారణమైంది.బార్క్ తాజాగా అధికారికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం 2016 లో ఎక్కువమంది టీవీ లో చూసిన సినిమాగా జనతా గ్యారేజ్ నిలిచింది.తెలుగులో బాహుబలి,శ్రీమంతుడు రికార్డులని కూడా టీవీ దగ్గరకొచ్చేసరికి ఎన్టీఆర్ అవలీలగా దాటేశాడు.జనతా గ్యారేజ్ అరుదైన ఘనత తో మా టీవీ చర్య ఎన్టీఆర్ కి లక్ తెచ్చిపెట్టింది.

Leave a Reply