ఎన్టీఆర్,నాగచైతన్య స్క్రీన్ షేరింగ్?

Posted September 24, 2016

 ntr naga chaitanya act multistarrer movie
 నందమూరి,అక్కినేని వారసులు వెండితెర షేర్ చేసుకోబోతున్నారా ? కచ్చితంగా ఎస్ అని చెప్పలేకపోయినా ఆ ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఈ ప్రయత్నం సాగిస్తున్నారు.ఎన్టీఆర్ ,నాగ చైతన్య ఒకే సినిమా లో నటించడానికి కథ కూడా రెడీ అయింది .అయితే అందరు అనుకున్నట్టు అది గుండమ్మ కథ రీమేక్ కాదు.మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమా.ఆ సినిమా దర్శకుడు ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్.అశ్వనీదత్ కి అల్లుడు కూడా .దీంతో అయన ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు.సావిత్రి తో పాటు ఎన్నో సినిమాల్లో నటించిన ఎన్టీఆర్, ఏఏన్నార్ పాత్రల కోసం Jr ,నాగచైతన్యలను దత్ అడిగారట.వారి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
        

SHARE