ఎన్టీఆర్ న్యూలుక్.. మరీ ఇంత భయంకరంగానా

 Posted March 27, 2017

ntr new look in jai lava kusa movie

నందమూరి వారసుడు ఎన్టీఆర్ వరుస హిట్ చిత్రాలతో అదరగొడుతున్నాడు. రెగ్యులర్ మాస్ ప్యాట్రన్ నుండి బయటపడి టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ వంటి సినిమాలు చేశాడు.. అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న జైలవకుశ సినిమాపై అభిమానులకు అంచానాలు పెరిగాయి. సినిమాకు సంబంధించిన న్యూస్ ఎప్పుడు ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే దర్శకుడు బాబి, ఎన్టీఆర్ లు మాత్రం సెట్ నుండి ఏ చిన్న విషయం బయటకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని రీసెంట్ గా వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రపంచం మొత్తం సెల్ ఫోన్ రూపంలో చేతిలోకి వచ్చేస్తే న్యూస్ ఎలా ఆగుతుంది చెప్పండి.

త్రిపాత్రాభినయం చేస్తున్న ఎన్టీఆర్ ఓ రోల్లో విలన్ గా నటించనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విలన్ రోల్ కి సంబంధించిన గెటప్ బయటకువచ్చింది. లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌  వంటి హాలీవుడ్‌ సినిమాకు పనిచేసిన మేకప్‌ మేన్‌ వాన్స్‌ గార్ట్‌ వెల్‌  జైలవకుశ సినిమాకి కూడా మేకప్ మేన్ గా పనిచేస్తున్నాడు.  గార్ట్ వెల్ రూపొందించిన ఎన్టీఆర్ విలన్ గెటప్ చాలా భయంకరంగా ఉంది కదూ. ఎన్టీఆర్ అంటే క్యూట్ లవర్ బోయ్ గా, మాస్ హీరోగా ఊహించుకునే అభిమానులు ఈ భయంకర లుక్ లో ఎలా ఆదరిస్తారో చూడాలి మరి…

SHARE