ఎన్టీఆర్ లుక్ పై రూమర్స్

0
536

Posted [relativedate]

rnt1యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తారక్ కొత్త సినిమా లుక్ ఇదేనంటూ కొందరు హడావిడి చేస్తున్నారు. మాసిన గడ్డంతో కనిపిస్తున్న తారక్ సరికొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు. అయితే ఈ లుక్ విషయంలో వస్తున్న రూమర్స్ అన్నిటిని ఖండిస్తున్నారు తారక్ పి.ఆర్ టీం. అసలు ఆ లుక్ ఇప్పటిది కాదని నాన్నకు ప్రేమతోలో ఫుల్ గడ్డం కోసం పెంచిందని అంటున్నారు.

ఓ పక్క పి.ఆర్ టీం క్లారిటీ ఇచ్చినా సరే తారక్ తను నటించే తర్వాత సినిమాలో ఇదే లుక్ తో కనిపిస్తారని అంటున్నారు. అసలు డైరక్టర్ స్టోరీ ఫైనల్ కాకుండా తారక్ తన లుక్ ఎలా చేంజ్ చేస్తాడు చెప్పండి. నాన్నకు ప్రేమతోలో డిఫరెంట్ లుక్ కోసం ఇలా గడ్డం పెంచేసి దాని నుండి ఆ షేప్ అవుట్ తెచ్చారట.

మొత్తానికి సోషల్ మీడియాలో మరోసారి తారక్ పిక్ ఓ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం దర్శకులందరితో కథల చర్చల్లో ఉన్న జూనియర్ సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం అదుర్స్ 2 కే ఎన్టీఆర్ మొగ్గుచూపుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave a Reply