తారక్ అయోమయం ఎందుకు..?

Posted October 10, 2016

   ntr new movie director selection confusion

‘జనతా గ్యారేజ్’ తర్వాత మరో చిత్రాన్ని మొదలెట్టలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గ్యారేజ్ హిట్ కిక్కుని ఎంజాయ్ చేస్తోన్నతారక్.. దసరా లోపు లేదా దసరా రోజున తన కొత్త సినిమా చెబుతారని నందమూరి అభిమానులు ఎదురు చూశారు. అయితే, తారక్ మాత్రం ఇంకా కన్ఫూజల్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తన కొత్త సినిమాపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నాడు తారక్.

ముందస్తు ప్లాన్ ప్రకారం ‘జనతా గ్యారేజ్’ తర్వాత తారక్ ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా తెరంగేట్రం చిత్రంలో నటించాల్సి ఉంది. వంశీ కూడా
తారక్ కోసం అదిరిపోయే యాక్షన్ ఎంటర్ టైనర్ ని రెడీ చేశాడు. అయితే, ‘జనతా గ్యారేజ్’ తర్వాత తారక్ టేస్ట్ లో మార్పు వచ్చింది. ఈ మార్పు తారక్ లో
కన్ఫూజన్ క్రియేట్ చేసింది.

‘జనతా..’ తర్వాత ఫ్యామీలు జనాలు మెచ్చే మరో కథలో నటించాలని తారక్ డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా
చేసేందుకు ట్రై చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాకి రెడీ అవుతోన్న త్రివిక్రమ్.. ఇప్పటికిప్పుడు తారక్ తో సినిమా చేసే పరిస్థితిల్లో లేడు. అదే చెప్పిన త్రివిక్రమ్.. భవిష్యత్ తప్పకుండా కలిసి పనిచేద్దామని చెప్పారట. పవన్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తారక్ తో జతకట్టనున్నాడని చెబుతున్నారు.

త్రివిక్రమ్ దొరకకపోవడంతో తారక్ గురి మళ్లీ పూరీపై పడింది. ఇప్పటికే ఈ కలయిక ‘టెంపర్’ చూపించారు. మరోసారి ఆ టెంపరేచర్ ని కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేశారు. అయితే, సడన్ గా పటాస్ ఫేం అనిల్ రాఘవపూడి ఎంట్రీ ఇచ్చాడు. తారక్ కి ఓ కథ వినిపించాడు. అది తారక్ కి కూడా బాగా నచ్చేసింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇక్కడ తారక్ మళ్లీ కన్ఫూజన్ లో పడినట్టు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత పూరి, అనిల్ లలో ఎవరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని తెగ ఆలోచిస్తున్నాడట.

తారక్ కొత్త సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కడం ఖాయమని చెబుతున్నారు. కానీ, అధికారిక ప్రకటన మాత్రం చేయడం లేదు. దీంతో..
ఈ కన్ఫూజన్ ఏంటీ..  తారక్? ఫీలవుతున్నారు నందమూరి అబిమానులు.

SHARE