ఎన్టీఆర్ కొత్త సినిమా ఎవరితో ?

   ntr new movie director
జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అయ్యాక యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటి ?గ్యారేజ్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ఇంటర్వ్యూ లో చెప్పిన మాటల్ని బట్టి వక్కంతం వంశీ సినిమా డ్రాప్ అయినట్టే అని చాలా మంది భావిస్తున్నారు .పూరి జగన్నాధ్ కి ఎన్టీఆర్ ఓకే చెప్పొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది .తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి పేరు కూడా వినిపిస్తోంది .ఆయన ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ ఎన్టీఆర్ చేతిలో పెట్టి నిర్ణయం కోసం ఎదురు చుస్తున్నాడంట.ఈ మూడు పేర్లకే ఎన్టీఆర్ పరిమితమయ్యారా అంటే కాదని అయన సన్నిహితులు చెప్తున్నారు .

జనతా గ్యారేజ్ తర్వాత ఇలాంటి సినిమా ..ఇలాంటి దర్శకుడు అని ఎన్టీఆర్ గిరి గీసుకున్నట్టు వస్తున్నవార్తల్లో నిజం లేదంట .కొందరు చిన్న దర్శకుల కధలు కూడా ఎన్టీఆర్ వింటున్నట్టు తెలుస్తోంది .ఎవరి కధ బాగా నచ్చితే ఆ దర్శకుడితో సినిమా చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యాడంట.ఎన్టీఆర్ కి కధ చెప్తున్నవారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నట్టు సమాచారం .ఓ ప్రముఖ నిర్మాత ఈ కాంబినేషన్ లో సినిమా చేయడానికి వువ్విళ్ళురుతున్నారు .కొత్త కధలు నచ్చకపోతే వంశీ తో సినిమా ఓకే అయినా ఆశ్చర్యపోనవసరంలేదు .

SHARE