సస్పెన్స్ కొనసాగిస్తున్న ఎన్టీఆర్..

Posted October 6, 2016

  ntr new movie suspense
ఇజం ఆడియో వేడుకలో ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రకటన వస్తుందని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది.ప్రకటన మాట అటుంచి చిన్నపాటి సంకేతం కూడా ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాడు ఎన్టీఆర్.దీంతో ఎన్టీఆర్ కొత్త సినిమా ఏంటి? ఎవరి దర్శకత్వంలో ఉంటుంది?ఈ విషయాలపై సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.జనతా గ్యారేజ్ విజయం తరువాత ఆచితూచి అడుగులు వేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.నాలుగైదు కధలు విన్నా దేనికి ఓటేయాలన్న సందిగ్ధం కొనసాగుతోంది.

ఈసారి ఎన్టీఆర్ చేయబోయే సినిమాకి అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఉండటం ఇప్పటికే నిర్ణయం అయిపోయింది.దర్శకుడి వ్యవహారాన్ని కూడా ఈ నెలలో అనౌన్స్ చేసే అవకాశముంది.పూరి,అనిల్ రావిపూడి,వక్కంతం వంశీ ఎన్టీఆర్ ముందున్న ఆప్షన్స్ అని బయటికి వస్తున్న వార్త.వీరెవ్వరు కాకుండా ఓ సెన్సషనల్ దర్శకుడు కూడా ఎన్టీఆర్ కి కథ చెప్పి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.ఆ డైరెక్టర్ కి ఎన్టీఆర్ ఓకే చెబితే అది కచ్చితంగా వెరయిటీ కాంబినేషన్ అవుతుంది.

[wpdevart_youtube]pf7Q9r1lXlg[/wpdevart_youtube]

SHARE