Posted [relativedate]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్ఫూజన్ లో ఉన్నాడు.’జనతా గ్యారేజ్’ తర్వాత మరో చిత్రాన్ని మొదలెట్టలేదు తారక్.ఏ దర్శకుడితో జతకట్టాలన్న విషయంలో తారక్ కన్ఫూజన్ లో ఉన్నాడు.త్రివిక్రమ్ కోసం ట్రై చేసినా..కుదరలేదు.దీంతో..పూరి జగన్నాథ్ తో మరోసారి టెంపర్ చూపించడానికి దాదాపు ఫిక్స్ అయినట్టు వార్తలొచ్చాయ్.అయితే, ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చిన పూరి-కళ్యాణ్ రామ్ ల ‘ఇజం’ రిజల్ట్ తో తారక్ మళ్లీ కన్ఫూజన్ లో పడినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే..పూరి సినిమాని హోల్డ్ లో పెట్టిన తారక్.. కొత్త కథలని వింటున్నాడంట.ఇటీవలే ‘ప్రేమమ్’ దర్శకుడు చందూ మొండేటి ఎన్టీఆర్ కి ఓ కథని వినిపించాడట.అది తారక్ కి కూడా బాగా నచ్చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.త్వరలో పూర్తి స్క్రిప్టుతో రావాలని చందూకి సూచించాడట తారక్.పూర్తి స్క్రిప్టు తో తారక్ ని మెప్పించగలిగితే..చందూ కి బంపర్ ఆఫర్ దక్కినట్టే.మరి..చందూ-ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి.