క్రికెట్ బరిలో  తొడగొట్టనున్న ఎన్టీఆర్..!!

0
345
ntr next movie in cricket theme

Posted [relativedate]

ntr next movie in cricket themeఎన్టీఆర్… ఈ యంగ్ టైగర్ పేరు చెబితే చాలు బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఆయన తొడగొడితే రికార్డులు, చిందేస్తే అవార్డులు… ఇది ఆయన కెపాసిటీ. డైలాగ్ చెప్పడంలోనూ, సన్నివేశానికి తగ్గట్టు హావభావాలను పలికించడంలోనూ ప్రస్తుత జెనరేషన్ లో ఎన్టీఆర్ పేరునే ముందు చెప్పుకోవచ్చు. ఎలాంటి రోల్ నైనా అవలీలగా చేసే ఎన్టీఆర్ ఈ సారి క్రికెట్ బరిలో తొడగొట్టనున్నాడని సమాచారం.  

క్రికెట్ అంటే చిన్నప్పట్నుంచి ఇష్టమున్న ఎన్టీఆర్ ఈ సారి ఏకంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమాలోనే  నటించనున్నాడు. ఖైదీనెం.150తో తిరుగులేని విజయం సాధించిన డైనమిక్ డైరెక్టర్ వి. వి. వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. నిజానికి ఎన్టీఆర్ నటిస్తున్న ప్రస్తుత సినిమా జైలవకుశ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాన్ తో సినిమా అయిన తర్వాత తారక్ తోనే  సినిమా చేయాలి. అయితే పలు కారణాల వల్ల పవన్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఆలస్యం అవుతుండడంతో ఎన్టీఆర్ చిత్రం మొదలవ్వడానికి మరింత సమయం పట్టేట్టు కనిపిస్తోంది. దీంతో ఈ గ్యాప్ లో వి. వి వినాయక్‌ తో ఓ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాడట ఈ నందమూరి వారసుడు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఆ సినిమాకు వినాయక్ ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టేశాడట. మాస్ అవతారంలో మెప్పించిన ఎన్టీఆర్ క్రికెటర్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.  

Leave a Reply