ఎన్టీఆర్ కొత్త టైటిల్ ‘దడ్కన్’ ..!

0
622

ntr11

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ రిలీజ్ కు రెడీ అయ్యాడు. భారీ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న గ్యారేజ్ పై చిత్రయూనిట్ అంతా నమ్మకంతో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్నోరోజులుగా జూనియర్ కోసం వెయిట్ చేస్తున్న వక్కంతం వంశీ ఎట్టకేలకు సినిమాకు సిద్ధమయ్యాడు. గ్యారేజ్ తర్వాత సినిమా అదే అని ప్రచారం జరుగుతున్నా ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి సరికొత్త అప్డేట్ అభిమానులను సంతోష పరుస్తుంది.

స్వతహాగా రైటర్ అయిన వక్కంతం వంశీ జూనియర్ కోసమే ఎన్నోసార్లు డైరక్షన్ ఛాన్స్ వచ్చినా చేయలేదు. చేస్తే ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తా అన్న వంశీకి జూనియర్ అవకాశమిచ్చాడు. ఇక ఈ సినిమా టైటిల్ గా దడ్కన్ అని పెట్టబోతున్నారని ఎక్స్ క్లూజివ్ టాక్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో రాబోతుంది. త్వరలో స్టార్ట్ అవబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవనుంది. మరి యంగ్ టైగర్ ను దడ్కన్ గా చూపించబోతున్న వక్కంతం సినిమాను ఏ రేంజ్ లో తీస్తాడో చూడాలి.

Leave a Reply