ఎన్టీఆర్ కి సక్సెస్ చిక్కులు ..

Posted September 23, 2016

 ntr not started new movie
ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కి రావడం ఎంత కష్టమో వచ్చిన సక్సెస్ నిలుపుకోవడం అంతకన్నా కష్టం..ఈ విషయం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బాగా అర్ధమవుతోంది. జనతా గ్యారేజ్ కన్నా ముందు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే ఎన్టీఆర్ టార్గెట్ ..నాన్నకు ప్రేమతో సినిమాకి ముందు 50 కోట్లు క్లబ్ లో చేరడం ఎన్టీఆర్ టార్గెట్..టెంపర్ కన్నా ముందు హిట్ సినిమా తీయడం ఎన్టీఆర్ టార్గెట్..వైఫల్యాలతో కొనసాగుతున్న కెరీర్ ని మళ్లీ ట్రాక్ ఎక్కించేందుకు ఎన్టీఆర్ పెట్టుకున్న టార్గెట్స్ ఇవి ..ఆ టార్గెట్స్ అయన రీచ్ అయ్యాడు.కాస్త కష్టమైనా చకచకా నిర్ణయాలు తీసుకోగలిగాడు.

టాక్ కి భిన్నంగా జనతా గ్యారేజ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.టాలీవుడ్ టాప్ త్రీ మూవీస్ లో స్థానం దక్కించుకుంది.దీంతో ఎన్టీఆర్ మళ్లీ టాప్ చైర్ మీద కన్నేశారు. దాన్ని అందుకోవాలంటే ఎలాంటి సినిమా తీయాలనేదానిపై మాత్రం ఎన్టీఆర్ డైలమాలోవున్నారు.గ్యారేజ్ హిట్ కి ముందు వక్కంతం వంశీ కధకి ఓకే చెప్పిన ఎన్టీఆర్ తర్వాత పునరాలోచనలో పడ్డారు.పూరి,అనిల్ రావిపూడి ,లింగు స్వామి కధలు విని కూడా ఎవరికీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు. దీంతో లింగుస్వామి బన్నీ తో సినిమా చేసేస్తున్నాడు.ఇదంతా చూస్తుంటే సక్సెస్ తెచ్చిన సంతోషం తో పాటు చిక్కులు ఏ స్థాయిలో వుంటాయో అర్ధమవుతుంది. ఈ అయోమయం నుంచి ఎన్టీఆర్ త్వరగా బయటపడాలని ఆశిద్దాం

SHARE