తారక్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..!

Posted November 30, 2016, 12:07 am

 

Image result for ntr and bobby movieజనతా గ్యారేజ్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద మరింత భాధ్యత పెరిగింది. తన మార్క్ సినిమాలకు భిన్నంగా గ్యారేజ్ లో కొత్త తారక్ ను చూపించి హిట్ అందుకున్న జూనియర్ ఆ హిట్ మేనియా కంటిన్యూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే తర్వాత సినిమా కథ మీద ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. ఇక పూరితో మొదలైన తారక్ కథా చర్చల కొనసాగింపు లేటెస్ట్ గా బాబి దాకా వచ్చి ఆగింది.

 

ఈ క్రమంలో బాబి చెప్పిన కథ కూడా కోనా వెంకట్ సహకారంతో రాసిందే అని టాక్. కోనా వెంకట్ రొటీన్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అదే ప్రేక్షకులు కోరుతున్నారని.. వాటినే దర్శక నిర్మాతలు రాయమంటున్నారంటూ అదే కామెడీని అదే కథలను అటు తిప్పి ఇటు తిప్పి రాసే కోన వెంకట్ జూనియర్ కు కథ అందించడం కాస్త విచిత్రంగానే ఉంది. అది కూడా తారక్ నచ్చేయడం మహా గొప్ప విషయం. నిజంగానే కోనా వెంకట్ అదిరిపోయే కథ అందించాడా లేక తారక్ మళ్లీ తప్పులో కాలేస్తున్నాడా అన్నది తెలియట్లేదు.

ఇక తన తర్వాత సినిమాగా ఆ కథ దాదాపు ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట తారక్. మరి పూరి, వక్కంతం వంశీ లాంటి స్టార్ రైటర్స్ కథలను కాదని కోనకు ఓటేస్తున్న ఎన్టీఆర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.