తారక్ అప్షన్ అదుర్శ్.. !

 Posted October 29, 2016

ntrఎన్టీఆర్ -వినాయక్ లది’ఆది’ బంధం.తారక్ కెరీర్ లో ఆది మూవీ వెరీ వెరీ స్పెషల్.ఈ సినిమాతో తారక్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.తెర బయట కూడా తారక్,వినాయక్ మంచి స్నేహితులు.వినాయక్ అన్నా అని పిలుపిచ్చుకునేంత చనువు ఉంది.

నిజానికి ఎన్టీఆర్ లో ఉన్న టాలెంట్ ని మొదట గుర్తించింది వినాయక్ నే.ఆది తో ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని బయటికి తీశాడు వినాయక్.ఇక,’అదుర్స్’ సినిమాతో ఎన్టీఆర్ లోని కామెడీ యాంగిల్ బయటపడింది.ఇందులో ద్విపాత్రాభినయం చేసిన తారక్..చారి పాత్ర ద్వారా కడుపుబ్బ నవ్వించేశాడు.

అయితే, ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఏ దర్శకుడితో జతకట్టాలనే కన్ఫూజన్ లో తారక్ బెస్ట్ ఆప్షన్ గా వినాయక్ ని సెలక్ట్ చేసుకొన్నట్టు సమాచారమ్.’ఇజం’ రిలీజ్ ముందు వరకు పూరితో సినిమా చేస్తే బెటర్ ఏమో అని ఆలోచనలో ఉన్నాడట తారక్. కానీ,’ఇజం’ రిజల్ట్ తర్వాత ఆ…ఆలోచనని కంప్లీట్ గా తీసేసినట్టు తెలుస్తోంది.ఇక,మిగిలిన ఒకే ఆప్షన్ వినాయక్.వీరి కలయికలో అదుర్స్ సీక్వెల్ ఎప్పటి నుంచి చర్చల్లో ఉంది. ఇప్పుడీ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు తారక్ రెడీ అయ్యాడు.

ప్రస్తుతం మెగాస్టార్ ఖైదీ నెం.150తో బిజీగా ఉన్నాడు వినాయక్.డిసెంబర్ లో మెగా ఖైదీ నుంచి వినాయక్ రిలీవ్ అవుతాడు.ఆ తర్వాత తారక్ సినిమాపై ఫోకస్ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. మరి..ఈసారి తారక్ లోనే ఏ యాంగిల్ బయటికి తీస్తాడో వినాయ్.

SHARE