ఎన్టీఆర్ ముందే గిఫ్ట్ ఇచ్చేశాడుగా..!!

0
310
ntr presents costly watch to bobby

Posted [relativedate]

ntr presents costly watch to bobbyఏదైనా శుభకార్యాలప్పుడో, పండగలప్పుడో గిఫ్ట్ లు ఇవ్వడం కామన్. అయితే సినిమా వాళ్లకు సంబంధించి తమ రీల్ లైఫ్ లో  సినిమా హిట్ అయినప్పుడు శుభకార్యం లేక పండగో జరిగినట్లు. ఇటువంటి పండుగలు జరిగినప్పుడు నిర్మాతలో, హీరోలో ఆయా సినిమాల దర్శకులకు  గిఫ్ట్ లు ఇస్తుంటారు. ఇటీవల కాలంలో ఇటువంటి గిఫ్ట్ ల గురించి చాలానే వింటున్నాం. అయితే సినిమా రిలీజయ్యి,  హిట్ అయిన తర్వాత ఇవ్వాల్సిన గిఫ్ట్ ముందే ఇచ్చేశాడు మన నందమూరి హీరో. అదేనండి జూ. ఎన్టీఆర్.

ఎన్టీఆర్ కి ఖరీదైన లగ్జరీ రిస్ట్ వాచెస్ అంటే ఇష్టముండడంతో, తన సినిమాలను హిట్ చేసే వారికి కూడా ఆయన అలాంటి రిస్ట్ వాచీలను గిఫ్టుగా ఇస్తుంటాడు.  ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్..  కొరటాల శివకి ఒక రిస్ట్ వాచీని కానుకగా ఇచ్చినట్టు ఫిలింనగర్ లో అప్పట్లో టాక్ నడిచింది. తాజాగా దర్శకుడు బాబీకి కూడా ఎన్టీఆర్ ఒక లగ్జరీ రిస్ట్ వాచీని గిఫ్ట్ గా ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం  బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే.  ఈ సినిమా కథ, తన పాత్రల క్యారక్టరైజేషన్ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందట. దీంతో  ఈసినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని భావించాడట. అందకే ఎన్టీఆర్ 4 లక్షల ఖరీదు చేసే రిస్ట్ వాచీని బాబీకి కానుకగా అందజేశాడని అంటున్నారు. మరి ఎన్టీఆర్ భావించినట్లు సినిమా హిట్ అవుతుందేమో చూద్దాం.

Leave a Reply