ఎన్టీఆర్,రాజమౌళి జట్టు …ఎప్పుడంటే?

Posted October 1, 2016

ntr rajamouli next movieఎన్టీఆర్..రాజమౌళి, ఈ కాంబినేషన్ గురించి కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసే వారికి ఓ శుభవార్త.వచ్చే ఏడాది ఇందుకు సంబంధించిన ప్రకటన,ఆ పై సంవత్సరం అంటే 2018 లో ఈ సెన్సషనల్ సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ పనుల్లో వున్న రాజమౌళి వచ్చే ఏడాది మే కి ఫ్రీ అవుతారు.ఆ తరువాత అయన ఓ చిన్న సినిమా చేసే అవకాశం వుంది.అందులో నాని హీరో అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.ఇది కేవలం ఎన్టీఆర్ సినిమా దృష్టిలో ఉంచుకొని చేస్తున్న సినిమా మాత్రమే.బాహుబలి వెంటనే ఎన్టీఆర్ సినిమా చేస్తే అంచనాలు పెరుగుతాయని …ఆలా ఉండకూడదనే రాజమౌళి ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారంట.మగధీర తర్వాత రాజమౌళి ఇలాగే సునీల్ తో మర్యాదరామన్న తీశారు.ఈసారి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవ్వనున్నారు.

నాని సినిమా అవ్వగానే ఎన్టీఆర్,రాజమౌళి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.ఈ సినిమా సబ్జెక్టు విషయాన్ని ఇప్పటికే రాజమౌళి ఆలోచించారట.మహాభారతం లేదా గరుడ …ఈ రెండు సబ్జెక్టు ల గురించి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.బాహుబలి పని అయ్యాక ఈ రెంటిలో రాజమౌళికి ఏది బాగా నచ్చితే అదే సబ్జెక్టు తో ఎన్టీఆర్ సినిమా కన్ఫార్మ్ అయినట్టే.ఇక ఎన్టీఆర్ కి కూడా ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వడానికి రెడీ గా ఉండమని రాజమౌళి సూచించారట.అందుకే కొత్త సినిమాలు ఒప్పుకునే ముందు డేట్స్ విషయానికి ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది.ఎనీవే ఎన్టీఆర్ అభిమానులు వచ్చే ఏడు శుభవార్త వినడానికి రెడీ అయిపోవచ్చు.

SHARE