Posted [relativedate]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ మహరాజ్ రవితేజలు తాము చేయాల్సిన కథలను ఒకరికొకరు మార్చుకున్నారు. అది తెలిసా తెలియక అన్నది తెలియలేదు కాని ప్రస్తుతం బాబి డైరక్షన్లో మూవీకి సిద్ధమైన తారక్ ఆ కథను ముందు రవితేజకు చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఇక అదే విధంగా రవితేజ చేస్తున్న అనీల్ రావిపూడి కథ ఇదవరకు ఎన్.టి.ఆర్ మెచ్చిన సబ్జెక్ట్. అలా ఇద్దరు కథలు నచ్చినా అవి చేసేందుకు పరిస్థితులు సహకరించక వదిలేయాల్సి వచ్చింది.
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్నో కథలు విన్న తారక్ బాబి చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాడు. ఇక రవితేజ కూడా తారక్ మెచ్చిన సబ్జెక్ట్ అనగానే అనీల్ తో సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే ఇక్కడ రవితేజ సినిమా మీద అందరి దృష్టి పడింది. పటాస్, సుప్రీం సినిమాలతో హిట్ అందుకున్న అనీల్ చెప్పిన కథ తారక్ నచ్చినా చేయడం కుదరలేదు. అయితే రవితేజ ఈ విషయంలో కరెక్ట్ డెశిషన్ తీసుకుని ఉంటాడంటున్నారు.
ఇక పవర్ తో హిట్ అందుకున్నా సర్దార్ గబ్బర్ సింగ్ తో ఫ్లాప్ మూటకట్టుకున్న బాబితో సినిమాకు సిద్ధమవడం తారక్ మరోసారి రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. మరి కథలు మార్చుకుని సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరు ఎవరు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.