ఎన్టీఆర్ కథ రవితేజతో చేస్తున్నాడు..!

0
254
Ntr Rejected Story Raviteja Doing Movie Tollywood

Posted [relativedate]

Ntr Rejected Story Raviteja Doing Movie Tollywoodపటాస్, సుప్రీం సినిమాలతో హిట్ అందుకున్న కుర్ర డైరక్టర్ అనీల్ రావిపూడి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ కథ చెప్పడం జరిగింది. తారక్ మొదట ఓకే అన్నట్టు వినిపించినా ఆ తర్వాత ఎందుకో ఆ సినిమా నుండి బయటకు వచ్చాడట. ఇక అదే కథతో మాస్ మహరాజ్ రవితేజతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు డైరక్టర్ అనీల్ రావిపూడి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

తారక్ కథ రవితేజకు సూట్ అవుతుందా అంటే అసలైతే కాదు కాని జూనియర్ కోసం ఒక వర్షన్ రాసుకున్న అనీల్ ఆ కథ తను కాదన్నాక రవితేజ కోసం మరో స్పెషల్ వర్షన్ రాసుకున్నాడట. మొదటి సిట్టింగ్ లోనే రవితేజ కథ ఓకే చేయడం దిల్ రాజు నిర్మాతగా ఫైనల్ అవడం అంతా జరిగింది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన అనీల్ కు మరో అవకాశం రావడమే కాకుండా ఇన్నాళ్లు రెమ్యునరేషన్ గొడవలవుతున్నాయని చెప్పిన దిల్ రాజు, రవితేజలు కూడా కలిసిపోయారు.

మరి తారక్ తో అనుకున్న కథతో రవితేజ సినిమా చేస్తున్న అనీల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే సినిమా ముహుర్తం పెట్టేయాలని చూస్తున్నారు దిల్ రాజు.

Leave a Reply