Posted [relativedate]
బాబి డైరక్షన్లో సినిమాకు సిద్ధమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాలో ఇప్పటికే డ్యుయల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటిదాకా ఇద్దరి హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన తారక్ రాబోయే సినిమాలో ముగ్గురితో నటించబోతున్నాడట. వారిలో ఓ స్టార్ హీరోయిన్ ఇద్దరు కొత్త హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుంది. పవర్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ రాగానే కాస్త ఢీలా పడ్డ డైరక్టర్ బాబి కొద్దిపాటి గ్యాప్ తీసుకుని తారక్ కు కథ సిద్ధం చేశాడు. సినిమా ఓ పక్క ఎంటర్టైన్ చేస్తూనే మాస్ మసాలా మూవీగా ఉండబోతుందట.
కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాకు తమిళ యువ మ్యూజిక్ కెరటం అనిరుథ్ సంగీతం అందించనున్నాడని అంటున్నారు. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత తారక్ కథల విషయంలో మరింత జాగ్రత్త పెంచాడు. అందుకే తనకు నచ్చే కథ దొరికే దాకా ఎంతోమంది దర్శకులతో కథా చర్చలు జరిపాడు. బాబి చెప్పిన కథ తనకు పర్ఫెక్ట్ అనుకున్న తారక్ వెంటనే సినిమాకు సిద్ధమయ్యాడు. బాబి లాస్ట్ సినిమా ఫ్లాప్ అయినా సరే అవేమి పట్టించుకోకుండా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కెరియర్ అటు ఇటుగా ఉన్న సమయంలో సరైన కథల ఎంపికతో మళ్లీ తన సత్తా చాటుతున్న తారక్ బాబి సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.