ఎన్టీఆర్ సీక్రెట్స్ ఇలా లీక్?

0
540
ntr secrets leak

Posted [relativedate]

ntr secrets leak
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీక్రెట్స్ లీక్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఇంకెవరు …ఎన్టీఆర్ వల్లే ఆ సీక్రెట్స్ లీక్ అవుతున్నాయి.సినిమా జీవితానికి సంబంధించి రహస్యంగా ఉంచుదామనుకున్న వ్యవహారాలు ఏదో ఒక వ్యక్తిగత కారణం వల్ల బయటికి వస్తున్నాయి. ఇలా రెండుమూడు సార్లు జరిగింది.తాజాగా రాజమండ్రి టు కాకినాడ టూర్ ఎపిసోడ్ అందుకు ఓ ఉదాహరణ.ఈ టూర్ వల్ల ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం మీద కళ్యాణ్ రామ్ ,బాబీ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా గెట్ అప్ బయటికి వచ్చింది. చుక్కల చొక్కా,లైట్ గడ్డంతో ఎన్టీఆర్ మెరిసిపోతున్నాడు.ఇదే కొత్త సినిమా గెట్ అప్ అని తెలిసి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.సినిమా స్టోరీ లీకేజీ మీద ఇటీవలే దర్శకుడు బాబీ ని అలెర్ట్ చేసిన ఎన్టీఆర్ …కుటుంబ ఫంక్షన్ కోసం వచ్చి తానే స్వయంగా ఓ సీక్రెట్ రివీల్ చేసాడు.
ఎన్టీఆర్ సినిమా కెరీర్ లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కిందట బాలయ్య ఇంట్లో ఫంక్షన్ కోసం వచ్చి యమదొంగ లో నాచోరే నాచోరే సాంగ్ గెట్ అప్ బయటపడింది. ఆ తర్వాత బాద్షా కోసం స్పెషల్ గెట్ అప్ ట్రై చేయాలని చాన్నాళ్లు సీక్రెట్ గా ఉంచారు.అయితే అప్పట్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నుంచి వైసీపీ కి వెళ్లడంతో దాని వెనుక ఎన్టీఆర్ హ్యాండ్ ఉందని పుకార్లు వచ్చాయి.వాటిని ఖండించేందుకు ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టడంతో బాద్షా గెట్ అప్ బయటికి వచ్చింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పర్సనల్ పని వల్ల ఇంకో గెట్ అప్ బయటికి వచ్చింది

Leave a Reply