చరణ్,బన్నీ లను కలిపిన ఎన్టీఆర్..

Posted September 24, 2016

 ntr top position than bunny charan
      జనతా గ్యారేజ్ హిట్ తో టాలీవుడ్ ఈక్వేషన్స్ చాలా మారిపోయాయి.ఎన్టీఆర్ టాప్ త్రీ లోకి చేరిపోగానే చరణ్,బన్నీ ఒక్కటైపోయారు.అదేంటి అంతకుముందు ఏమైనా ఉన్నాయా అని సందేహాలొద్దు ! మేము చెప్పేది కేవలం టాలీవుడ్ టాప్ 5 లో స్థానం గురించి మాత్రమే.గ్యారేజ్ 80 కోట్ల షేర్ దాటగానే టాప్ 5 లో వచ్చిన మార్పులు ఇవి ..

    ఇప్పటికి టాప్ చైర్ బాహుబలిదే..ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 600 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా తెలుగు వెర్షన్ 180 కోట్ల షేర్ సొంతం చేసుకుంది.ఇక రెండో స్థానంలో వున్న శ్రీమంతుడు 85 కోట్ల షేర్ సాధించింది.తాజాగా జనతా గ్యారేజ్ తో 81 కోట్ల షేర్ రాబట్టి ఎన్టీఆర్ థర్డ్ ప్లేస్ లో సెటిల్ అయ్యాడు.75 కోట్ల షేర్ తో అత్తారింటికి దారేది నాలుగో స్థానంలో వుంది.ఇక ఐదో స్థానంలో బావాబావమరుదులు చరణ్,బన్నీ ఒక్క చోటే వున్నారు.వీళ్ళు నటించిన మగధీర ,సరైనోడు …రెండు సినిమాలు 73 కోట్ల షేర్ తో టాలీవుడ్ రేస్ లోఒకే ప్లేస్ లో వున్నాయి.
     

SHARE