పక్కా : త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా

 Posted October 26, 2016

ntr trivikram movie fixటాలీవుడ్ హీరోలందరూ కోరుకునే దర్శకుడు త్రివిక్రమ్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. చాన్నాళ్ల నుంచి త్రివిక్రమ్ కలసి ఓ సినిమా చేయాలని ఆశపడుతున్నాడు. ఆ దిశగా గట్టిగా ప్రయత్నాలు కూడా చేశాడు. నిర్మాతలు పీవీపీ, రాథాకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్.. ఇలా చాలా మంది త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబో ఓకే చేసేందుకు విశ్వపయత్నాలు చేశారు. కానీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

అయితే, తాజా సమాచారమ్ ప్రకారం త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో ఓకే అయ్యింది. ఎవ్వరికీ సాధ్యంకానిది దిల్ రాజు సాధించాడు. దిల్ రాజు బ్యానర్ లో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది.. ‘అ ఆ’ తర్వాత దిల్ రాజు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాని తారక్ తో సెట్ చేశాడు దిల్ రాజు. దీంతో.. త్రివిక్రమ్ తో సినిమా చేయాలన్న తారక్ కోరిక తీరనుంది. అతి త్వరలోనే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.

SHARE