ఎన్టీఆర్,త్రివిక్రమ్ జోడుగుర్రాలు?

0
515

Posted [relativedate]

ntr-and-trivikram
ఎన్టీఆర్,త్రివిక్రమ్ ….ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడా…ఎప్పుడా అని ఎదురు చూసిన వారి కోరిక తీరబోతోంది.ఈ ఇద్దరి కాంబినేషన్ లో తాము సినిమా తీయబోతున్నట్టు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ అధికారికంగా ప్రకటించారు.కొత్త సంవత్సర కానుకగా ఈ సినిమా ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.అయితే సినిమా షూటింగ్ 2017 సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది. అంతకన్నా ముందు పవన్ తో త్రివిక్రమ్,బాబీ తో ఎన్టీఆర్ సినిమా పూర్తి చేస్తారు.

ఈ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీ లో ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి .వెనక్కెళ్లాయి..ఈసారి మాత్రం క్లారిటీ వచ్చింది.దీనిపై ఓ ఎన్టీఆర్ అభిమాని ఇలా స్పందించాడు..త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు ……సూదిలో దారం గుచ్చినంత సులువుగా మాటల కలంలో మనసు ఇంకు పోసేస్తాడు …గుండెలయలంత పొందికగా భావాల్ని పొదిగేస్తాడు …ఇక ఎన్టీఆర్ స్వర యంత్రుడు ..ఏ మాటకి ఎక్కడ కీ ఇవ్వాలో …తెలుగు భాషని ఎక్కడ వంచాలో ఎక్కడ తెంచాలో తెలిసిన స్వర మేధావి…ఇక వాళ్ళిద్దరి కాంబినేషన్ గురించి చివరిగా ఓ మాట ..రౌతు కొద్దీ గుర్రం అన్నది అందరికీ తెలిసిన పాత సామెత .కానీ ఓ గుర్రం మీద ఇంకో గుర్రమే ఎక్కి స్వారీ చేస్తే …ఆ ఊహే అంచనా కి అందడం లేదు కదా ….ఈ కాంబో కూడా అంతే ..

Leave a Reply