అలాంటి ఫ్యాన్స్ నాకొద్దు : ఎన్టీఆర్

0
994
ntr warning fans

ntr warning fans

కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ అభిమాని అక్షయ్ కుమార్ పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ ను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో వెంటనే తిరుపతి వెళ్లి వినోద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ వినోద్ హత్యకు కారణాలు తెలుసుకున్నాడు. అయితే ఈ విషయం పట్ల ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు అన్న దాని మీద అందరు ఎదురుచూశారు. అనుకున్నట్టుగానే తారక్ కూడా హద్దులు దాటే అభిమానం చేయొద్దు. ముందు దేశాన్ని, ఆ తర్వాత తల్లి తండ్రులను, భార్య పిల్లలు, మిత్రులు శ్రేయోభిలాషులు, చివరకు ఇష్టమైన హీరోలను అభిమానించండి అన్నారు.

క్రాస్ రోడ్స్ లో నాలుగు రోడ్స్ ఉంటే ముందు దేశం గురించి, ఆ తర్వాత తల్లి తండ్రుల గురించి, భార్య పిల్లల గురించి, శ్రేయోభిలాషుల గురించి ఆలోచించి ఆ తర్వాత అభిమాన హీరోకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మా హీరోల మధ్య ఎలాంటి గొడవలు లేవు ఉండవు. కాని అభిమానులు గొడవ పడటం బాధగా ఉంది. నా అభిమానులే కాదు అందరి అభిమానులు దయచేసి గొడవలు పడొద్దని అన్నారు. ఇక ఇలాంటి సంఘటనలు నా అభిమానులు చేయరని ఆశిస్తున్నా.. లేదు ఒకవేళ ఇలాంటివి రిపీట్ చేస్తే కనుక వారు నా అభిమానులుగా ఉండనవసరం లేదు అని గట్టిగానే చెప్పాడు యంగ్ టైగర్.

Leave a Reply