అభిమానులకు ఎన్టీఆర్ సందేశం..

0
5951

  ntr wrote letter all over celebrities fans

పవన్ అభిమాని హత్య నేపధ్యం లో ఎన్టీఆర్ కూడా స్పందించాడు. అభిమానం పేరిట జీవితాలను పాడు చేసుకోవద్దని వివరించాడు. అదే విషయాన్ని లెటర్ ద్వారా  చెప్పాడు.

ఎన్టీఆర్ లేఖ‌:
తెలుగు సినిమాను ప్రేమించి వాళ్లంద‌రికి నేను శిరస్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. తాత‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు గారి అభిమానుల‌కు, బాబాయ్ బాల‌కృష్ణ అభిమానుల‌కు, అక్కినేని ఫ్యామిలీ అభిమానుల‌కు, మెగా ఫ్యామిలీ అభిమానుల‌కు, ప‌వ‌ర్‌ష్టార్ అభిమానుల‌కు, ప్ర‌భాస్ అభిమానుల‌కు , నా అభిమానుల‌కు నా మ‌న‌వి. ప్రేమించే అభిమానుల‌ను గుండెల్లో పెట్టుకోవాలే కాని.. వారిపై ప్రాణాలు తీసుకునేంత అభిమానం పెంచుకోవ‌డం మంచిది కాద‌ని తెలియ‌జేస్తున్నాను. తెలుగు చిత్ర‌సీమ‌లో హీరోలంద‌రూ మీకోస‌మే ఉన్నారు. మీమ్మ‌ల‌ను సంతోష‌ప‌ర‌చ‌డం కోస‌మే మేము క‌ష్ట‌ప‌డుతున్నాము… అంతేకాని మీరు ఇలా ప్రాణాలు తీసుకోవ‌డం భావ్యం కాదు… మేమంతా స్నేహ‌పూర్వ‌కంగా క‌లిసిమెలిసి ప‌నిచేస్తున్నాం. కానీ అభిమానుల్లోనే వ‌ర్గాలుగా చీలి అల్ల‌ర్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఏ హీరో కూడా హ‌ర్షించ‌రు.

ప్ర‌తి అభిమానికి ఓ కుటుంబం ఉంటుంది.. ఓ త‌ల్లి ఉంటుంది.. ఓ తండ్రి ఉంటాడు… చెల్లి, భార్య‌, పిల్ల‌లు ఇలా ఎన్నో బాధ్య‌త‌లు ఉంటాయి. ఏదైనా సాధించాల‌న్న కోరిక ఉంటుంది. అంతేకాని హీరోల‌పై ఇలా విప‌రీత‌మైన అభిమానం పెంచుకుని ప్రాణాలు తీసుకోవ‌డం మంచిది కాదు. అది ఎవ‌రైనా స‌రే..తోటి అభిమానుల‌ను, మ‌నుష్యుల‌ను ప్రేమించండి. ఇటీవ‌ల చ‌నిపోయిన చిత్తూరు జిల్లా తిరుప‌తి వాసి వినోద్ రాయ‌ల్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని..వారి కుటుంబానికి నా ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేస్తున్నాను. ఇక ముందు ఇలాంటి వార్త‌లు వినిపించ‌వ‌ని ఆశిస్తూ..మీ జూనియ‌ర్ ఎన్టీఆర్‌.

Leave a Reply