టీఆర్ఎస్ కు దగ్గరవుతున్న టీబీజేపీ ఎమ్మెల్యే!!

Posted February 6, 2017

nvss prabhakar joins trs
తెలంగాణలో బీజేపీ బలం రోజురోజుకు తగ్గిపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం కమలం వికసించడం లేదు. దానికి రాష్ట్ర నాయకత్వమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. అందుకే టీఆర్ఎస్ వైపు బీజేపీ క్యాడర్ చూస్తున్నారట. బీజేపీకి రాష్ట్రంలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు. ఆ ఐదుగురిలో ఒకాయన టీఆర్ఎస్ లో క్లోజ్ ఉంటున్నారని టాక్. ఇంతకీ ఆయనెవరో కాదు… ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.

నిజానికి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నారు. కిందిస్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. మీడియాలో బీజేపీ వాయిస్ ను వినిపించడంలో అందరికీ ముందుంటారు ప్రభాకర్. అయినా కమలం పార్టీ మాత్రం ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎంతసేపు రాష్ట్రపార్టీ అంటే కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మణ్ తప్ప మరెవ్వరినీ పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభాకర్ టీఆర్ఎస్ తో దోస్తీకి తహతహలాడుతున్నారట. ఇప్పటికే గులాబీ నాయకులతో సంప్రదింపులు కూడా జరిపారని టాక్. సీఎం కేసీఆర్ కూడా ప్రభాకర్ తో మాట్లాడారట. మంచి సమయం చూసుకొని పార్టీలోకి రావాలని ఆహ్వానించారని సమాచారం.

బీజేపీ నాయకులకు ఈ విషయం తెలిసి ప్రభాకర్ ను పిలిచి మాట్లాడారట. తొందరపడొద్దని సూచించారట. కానీ ఆయన మాత్రం నిర్ణయం జరిగిపోయిందని చెప్పారట. ఆయన కారెక్కెందుకే అన్నీ సిద్ధమైపోయాయని టాక్. అయితే జూన్ తర్వాతే ఈ జాయినింగ్ ఉంటుందని సమాచారం. ఆలోపు బీజేపీ నాయకులతో తనకున్న పెండింగ్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారట ప్రభాకర్. అంటే ఐదుగురిలో ఒకరు జంప్ అయిపోతే.. ఇక బీజేపీ మిగిలేది ఆ నలుగురే!!! అయితే మోడీతో సన్నిహితంగా ఉండే కేసీఆర్.. ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేను టీఆర్ఎస్ లో చేర్చుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో.. చూడాలి.

SHARE