పోయెస్ గార్డెన్ పేరు,ఓనర్ మారిపోతున్నారు…

Posted February 9, 2017

o panneerselvam changed from poes garden name to jaya memorial
పోయెస్ గార్డెన్ …కొన్ని దశాబ్దాలుగా ఒక్క తమిళులకు మాత్రమే కాకుండా దేశమంతటికీ చిరపరిచితమైన పేరు ..అది తమిళుల అమ్మ జయలలిత నివాసమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జయ మరణం తర్వాత ఆ ఇంటిలో శశికళ ఉంటున్న విషయం తెలిసిందే.అయితే అదంతా గతం కాబోతోంది.పోయెస్ గార్డెన్ పేరు మారబోతోంది.ఇకపై దాని ఓనర్ కూడా మారబోతున్నాడు.శశికి ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న పన్నీర్ సెల్వం పోయెస్ గార్డెన్ పై సీరియస్ గా దృష్టిపెట్టాడు.పొద్దున్న ఆ ఇంటిలో వుండే హక్కు శశికి లేదని చెప్పిన ఆయన సాయంత్రానికి కార్యాచరణలోకి దిగాడు.పోయెస్ గార్డెన్ పేరుని జయ మెమోరియల్ గా మార్చాలని ముఖ్యమంత్రి హోదాలో నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన జీవో రెడీ చేయాలని సీఎస్ ని ఆదేశించారు. ఆయన ఇదే స్పీడ్ లో ముందుకెళితే పోయెస్ గార్డెన్ పేరు మారడమే కాదు,ఇంకొన్ని రోజుల్లో ఆ ఇంటి నుంచి పెట్టేబేడా సర్దుకుని శశి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.పన్నీర్ దూకుడు చూస్తుంటే పేట్టేబేడా సర్దుకోడానికి కూడా టైం ఇస్తాడో..లేదో అన్నట్టుంది.

SHARE