సెల్వం బాంబు పేల్చాడు..

Posted February 8, 2017

o panneerselvam sensational comments on sasikala
నేను ఇప్పటిదాకా మాట్లాడింది 10 శాతమే .ఇంకా 90 శాతం మాట్లాడాల్సి వుంది అని తొలివిడతలో వార్నింగ్ ఇచ్చిన పన్నీర్ సెల్వం అన్న మాట నిలబెట్టుకున్నారు.ఆ మాటన్న కొద్ది గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చాలా విషయాలు మాట్లాడారు.అయితే శశి రహస్యాల్ని మాత్రం ఇంకా గుప్పిటనే వుంచుకున్నట్టుంది.ప్రస్తుతానికి అవసరమైన అన్ని అంశాల్ని టచ్ చేశారు.ఆయన చెన్నైలోమాట్లాడిన మాటలు బాంబుల్లా పేలాయి.

1 . శశికళ పార్టీకి తాత్కాలిక ప్రధానకార్యదర్శి మాత్రమే
2 . నన్ను పార్టీ కోశాధికారిగా జయ నియమించారు,ఆ బాధ్యతల నుంచి నన్ను తప్పించే అధికారం పార్టీలో ఎవరికీ లేదు.
3 .జయలలిత మృతిపై అనుమానాలు వున్నాయి.శశికళ తప్ప జయని ఆస్పత్రిలో మరెవరూ చూసే వీలు లేకుండా చేశారు.సుప్రీమ్ కోర్ట్ జడ్జి తో విచారణ జరిపిస్తాం.
4 .అవసరమనుకుంటే రాజీనామా వెనక్కి తీసుకుంటా ..గవర్నర్ చెన్నై రాగానే కలిసి నా అభిప్రాయం చెబుతా .అవకాశం దొరికితే అసెంబ్లీ లో నా బలాన్ని నిరూపించుకుంటా.
5 .నా తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం లేదు.పార్టీ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం
6 .జయ మేనకోడలు దీపా మద్దతు తీసుకుంటాం.
7 . అన్నాడీఏంకేని రక్షించాల్సిన బాధ్యత నాపై వుంది.తమిళనాడంతా తిరిగి ప్రజల మద్దతు కూడగడతా.

ఇలా ఇన్నాళ్లు సస్పెన్స్ గా వున్న ఎన్నో అంశాలపై సెల్వం స్పష్టత ఇచ్చారు.ఏ మాత్రం తడబాటు,ఆవేశకావేశాలు లేకుండా నవ్వుతూనే అన్ని విషయాలపై సెల్వం సూటిగా సమాధానం చెప్పి సమరభేరి మోగించారు.ఇక పన్నీర్ కి అండగా ఉంటామని పార్టీ సీనియర్ నేత ,మాజీ స్పీకర్ పాండియన్ ,ఎంపీ మైత్రేయన్అదే ప్రెస్ మీట్ లో ప్రకటించారు.

SHARE