Posted [relativedate]
గవర్నర్ విద్యాసాగరరావు తో తమిళ సీఎం పన్నీర్ సెల్వం భేటీ జరిగింది కేవలం 15 నిమిషాలు మాత్రమే.ఈ పావుగంటలోనే తాను చెప్పదల్చుకున్న అంశాల్ని సూటిగా చెప్పేశారు పన్నీర్.ఇంతకీ ఆయన చెప్పిన ఆ ఐదు విషయాలు ఇవే..
1 . తనతో బలవంతంగా రాజీనామా చేయించారు.
2 .శశికళ చెప్తున్నట్టు ఆమె వెనుక 130 మంది ఎమ్మెల్యేలు వున్నారనడం అబద్ధం
3 . శశికళ స్వార్ధ రాజకీయాలతో తమిళనాడుకి తీవ్ర నష్టం జరుగుతుంది.
4 . మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు మాకే వుంది.
5 . రాజీనామా వెనక్కి తీసుకుంటా..బలనిరూపణకి అవకాశం ఇవ్వండి.
ఈ ఐదు విషయాలు గవర్నర్ కి వివరించారు పన్నీర్.అన్ని విషయాలు విన్న గవర్నర్ నిర్ణయం తరువాత చెప్తానన్నారు.అయితే ఆ భేటీ తర్వాత బయటకు వచ్చిన పన్నీర్ ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు 7 గంటలకు శశికళ గవర్నర్ ని కలవనున్నారు.ఆమెతో కేవలం 10 మంది బృందమే గవర్నర్ ని కలిసేందుకు అనుమతి లభించింది.