భారతీయుడి తెలివి….

0
716

  obama appreciated indian intelligence

ఒక భారతీయుడు లోను కోసం అమెరికన్ బ్యాంకు లోకివెళతాడు… తనకు చాలా అత్యవసరంగా ఐదు వేల డాలర్లు అవసరముందని తాను అన్ని ప్రదేశాలలో మిత్రుల దగ్గరా అడిగానని ఫలితం లేకుండా పోయిందనీ..తన కోటి రూపాయల “ఫెరారీ ” కారును తాకట్టు పెట్టుకుని తనకు ఆ అయిదు వేలు ఇప్పించవలసిందిగా కేవలం వారం రోజుల్లో తిరిగి తీరుస్తానని హామీ ఇచ్చాడు…

ఈ బ్యాంకు వారికి చాలా ఆశ్చర్యం వేసింది అస్సలు వీడికేమైనా పిచ్చి లేసిందా.. కోటి రూపాయల కారును అంత ఛీప్ గా మరీ ఐదువేలకు తకట్టు పెడుతున్నాడేంటి అని చాలా సార్లు తర్జనభర్జనలు పడ్డారంట. సరే ఏమైతే అదైందిలే… వీడు తీర్చలేకపొతే కారు మనదవుతుంది కదా అనుకుని…

మేనేజర్ కార్ తాళాలు తీసుకుని జాగ్రత్తగా పార్కింగ్ చేసి సార్ మీరప్పుడైనా వచ్చి డబ్బు కట్టి మీకారు తీసుకుపోవచ్చని చెపుతాడు…. ఒక వారం గడుస్తుంది… ఆ భారతీయుడు తిరిగి బ్యాంకుకు వచ్చి ఐదువేల డాలర్లకు వడ్డి $15.41 డాలర్లు కట్టి కారును తీసుకువెళ్ళేందు కు సిద్ధమవుతాడు…

ఇంతలో ఆ యువ బ్యాంకు మేనేజర్ ఆసక్తి చంపుకోలేక “ సార్! మీరు కోటి యాభైలక్షల కారు ను తాకట్టు పెట్టి కేవలం ఐదువేల డాలర్లు అప్పు తీసుకున్నారు… మీరు గట్టిగా ప్రయత్నిస్తే తప్పక దొరికేవి కదా.. దీనిలో మర్మమేంటి” అని అడిగాడు… అప్పుడు మన భారతీయుడు… “సార్! విమానాశ్రయంలో పార్కింగ్ కు దాదాపు ఈ వారం రోజులకు ఐదువందల డాలర్లు కట్టవలసి వచ్చేది.. నేను ఇక్కడ మీకు కేవలం $15.41 డాలర్లు మాత్రమే చెల్లించి వారం రోజులు కారును చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను…

విమానాశ్రయంలొ అయితే కొంచెం భద్రత/శుభ్రత కూడా తక్కువ… ఇక్కడ మీరు చాలా బాగా చూసు కున్నారు.. ధన్యవాదములు”.. అని చెప్పాడు… బ్యాంకు మేనేజర్ కు నోట మాటరాలేదు.. ఈ విషయం తెలిసిన ఒబామా మన భారతీయుల తెలివి తేటలకు హతాశుడయ్యాడట.. ఇది అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన…

Leave a Reply