ఒబామా గర్వపడింది ఎందుకో తెలుసా..

Posted November 21, 2016

obama

నువ్వు చాలా మంచివాడివి. నీలాగే అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నా’ అని ఆరేళ్ల బాలుడిని ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. సిరియా అంతర్యుద్ధం బాధిత బాలుడు ఒమ్రాన్ గురించి తనకు లేఖ రాసిన అలెక్స్‌ అనే అమెరికా బాలుడిని ఒబామా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన అధికారిక నివాసానికి ఆహ్వానించి అలెక్స్‌ తో మాట్లాడారు. అలెక్స్‌ తన కుటుంబ సభ్యులతో పాటు వైట్‌ హౌస్‌ కు వెళ్లి ఒబామాను కలిశాడు. ఒమ్రాన్ పట్ల అలెక్స్‌ చూపిన మానత్వానికి ఒబామా ముగ్దుడయ్యారు. చిన్నవయసులోనే అరుదైన వ్యక్తిత్వం కనబరిచిన అలెక్స్‌ పై పొగడ్తల వర్షం కురిపించారు.

సిరియా వైమానిక దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ ఫొటోను చూసి కదిలిపోయిన అలెక్స్‌ ఒబామాకు లేఖ రాశాడు. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. ఈ ఉత్తరాన్ని ఐక్యరాజ్యసమితిలో ఒబామా చదివి వినిపించారు.

SHARE